తనకు పెళ్లి కాకుండా చేతబడి చేసిందంటూ

తనకు వివాహం కాకుండా చేతబడి చేస్తుందన్న అనుమానంతో ఓ మహిళ ను దారుణంగా హతమార్చాడో యువకుడు. మూడనమ్మకాల నేపథ్యంలో అమాయక మహిళను పొట్టనపెట్టుకున్న ఈ దుర్ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌ పూర్‌ కి చెందిన పింటు అనే యువకుడు బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇతడికి పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇతడు 12 పెళ్లి చూపులు చూడగా అందరూ ఇతడిని రిజెక్ట్ చేశారు. పెళ్లి చూపులు చెడిపోతుండటంతో తీవ్ర ఒత్తడికి లోనైన పింటు, తన పెళ్లి కాకుండా ఎవరో కుట్ర పన్నుతున్నారని భావించాడు. పెళ్లి సంబంధాలు చెడిపోవడానికి కారణం తన పక్కింట్లో ఉంటున్న అమెరికా పటేల్‌ అనే యువతి అని అనుమానించాడు. దీంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి గొంతు నులిమి చంపేశాడు.

 అయితే హత్య అనంతరం పింటు పారిపోతుండగా చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.