50 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని ఆర్డర్‌ చేశాడు టీవీ కొన్న విషయం ఇంట్లో చెప్పకుండా సర్ ప్రైజ్  చేద్దామనుకోగా.. మానిటర్ చూసి అతనే ఆశ్చర్యపోయేంత పనయ్యింది.

మరో ఆన్ లైన్ మోసం తెరపైకి వచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ లో ఒక వస్తువు కొంటే మరొక వస్తువు ఇంటికి రావడం లాంటి వార్తలు చాలానే చూశాం. ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవల ముంబయిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..ముంబయికి చెందిన మహమ్మద్‌ అనే వ్యక్తి ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రంజాన్‌ పండుగ సమయంలో అమెజాన్‌ ఆఫర్లు పెట్టడంతో 50 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని ఆర్డర్‌ చేశాడు. తన క్రెడిట్‌ కార్డు నుంచి రూ.33వేలు అమెజాన్‌కు చెల్లించాడు. మే 19న అనుకున్నట్లే ఇంటికి టీవీ డెలివరీ అయింది. వచ్చిన ప్యాకేజ్‌ను అప్పుడే తెరవద్దని.. టెక్నీషియన్‌ వచ్చాక అతడే తెరిచి టీవీ బయటకు తీస్తాడని డెలివరీ సిబ్బంది చెప్పారు. మరుసటి రోజు టీవీ బిగించేందుకు వచ్చిన టెక్నీషియన్‌ బాక్స్‌ తెరిచి చూడగా.. అందులో టీవీకి బదులుగా ఏసర్‌ కంపెనీకి చెందిన 13 అంగుళాల మానిటర్‌ దర్శనమివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

మహమ్మద్ ఈ విషయాన్ని వెంటనే అమెజాన్‌ కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదు

టీవీ కొన్న విషయం ఇంట్లో చెప్పకుండా సర్ ప్రైజ్ చేద్దామనుకోగా.. మానిటర్ చూసి అతనే ఆశ్చర్యపోయేంత పనయ్యింది.

చేసి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. అమేజాన్ కి ఫిర్యాదు చేసి రెండు నెలలు అయినప్పటికీ అమెజాన్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అతడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన అమెజాన్‌ ప్రతినిధి తమకు మహమ్మద్ నుంచి ఫిర్యాదు అందిందని.. త్వరలోనే అతని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.