ప్రాణం పణంగా పెట్టిన యుపి పేద వాడు, లెక్క చేయని అధికారి ( వీడియో )

First Published 13, Apr 2018, 5:09 PM IST
man hanging onto cars bonnet up official drives 4-km
Highlights
చేజారినా, బానెట్ పట్టుకున్న వ్యక్తి కారు కింద పడి చనిపోతాడు.

ఒక మనిషి  బానెట్ పట్టుకుని ఉన్నా , కార్ వేగంగా వెళుతూ ఉంది. కాలు జారినా, చేజారినా, బానెట్ పట్టుకున్న వ్యక్తి కారు కింద పడి చనిపోతాడు.అయినా ఈ ప్రమాదకరమయిన ప్రయాణం నాలుగు కిలో మీటర్లు సాగింది. ఇదేదో సాహస యాత్ర అనకుంటున్నారా, కాదు. ఇది ఒక నిరసన కార్యక్రమం. కారులో నడుపుతున్న వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక బ్లాక్ డెవెలప్ మెంట్ ఆఫీసర్ పంకజ్ కుమార్ గౌతమ్. కారుముందునిలబడుకున్నది  బ్రిజ్ పాల్ , ఒక పేద వాడు. మొన్నామధ్య రామ్ నగర్ కు చెందిన ఒక కొంత మంది పేదవాళ్లు తాము కట్టుకుంటున్న మరుగుదొడ్లకు రెండో విడత సబ్సిడి ఎంతకు రానందున బిడివొ ఆఫీస్ కు వెళ్లారు. ధర్నా చేశారు. ఎవ్వరూ వీరిని పట్టించుకోలేదు. చివర ఇదేది తన వ్యవహారం కాదన్నట్లు బిడివో కారెక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. పేదవాళ్లంతా కారును చట్టుముట్టారు. అయినా సరే బిడివొ పంకజ్  కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ప్రాణభయంతో అంతా కారుకు దారిచ్చారు.అయితే, బ్రిజ్ పాల్ మాత్రం ఎగిరి కార్ బానెట్ ఎక్కాడు. కారు అలాగే నాలుగు కిలో మీటర్లు వెళ్లింది. ఆతర్వాత  ఇద్దరు కేసులు పెట్టుకున్నారు. కలెక్టర్ ఒక దర్యాప్తు చేయాలని మరొక ఉన్నతాధికారిని ఆదేశించారు.

 

loader