Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల ఇసుక లారీకి మరొకరు బలి

  • సిరిసిల్లలో ఇసుక దందా
  • రాజకీయ అండతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
  •  ప్రజలను బలి తీసుకుంటున్న ఇసుక ట్రక్కులు
man crushed to death by notorious sirclla sand truck

రాష్ట్ర ఐటి మంత్రి కెటిరామారావు నియోజకవర్గం సిరిసిల్లలో  ఇసుక మాఫియా ద‌న దాహానికి మ‌రో ద‌ళిత కుటుంబం బ‌జారున‌ప‌డింద‌ని  పిసిసి అధ్యక్షుడు టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విరుచుప‌డ్డారు.

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ‌లం పోతుగ‌ల్ గ్రామంలో గిన్నె శంక‌ర్ అనే ద‌ళిత రైతు పొలం వ‌ద్ద‌కు వెళుతుండ‌గా ఇసుక లారీ డీ కొన‌డంతో తీవ్ర గాయాల పాల‌య్యాడ‌ని, ఆయ‌న‌ను స‌మీపంలోని ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ ప‌రిస్తితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్ నిమ్స్‌కు త‌ర‌లించార‌ని అక్క‌డ చికిత్స పొందుతూ శంక‌ర్ మృతి చెందార‌ని ఉత్తమ్ చెప్పారు. 

కేసిఆర్ కుటుంబం, కేటిఆర్ స్వ‌యంగా ఇసుక మాఫియాకు అండ‌గా ఉండ‌డంతో వారు చెల‌రేగిపోతున్నార‌ని ఆయన విమర్శించారు.

 ‘ప్ర‌తి ప‌ది రోజుల కొక‌సారి ఇసుక లారీ ప్రమాదం జ‌రుగుతున్నది.  దుమ్ము, దూళిల‌తో, శ‌బ్దాల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్నార‌ు.  ప్ర‌జ‌ల ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి.  కేటిఆర్  ద‌న దాహంతో  ఉన్నాడు.  డ‌బ్బు పిచ్చి ప‌ట్టిన వాడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ు,’ అని  ఆయ‌న తీవ్రంగా దుయ్య బ‌ట్టారు. 


‘సిరిసిల్ల ఎమ్మెల్యేగా అక్క‌డి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తే గెలిచి ఇప్ప‌డు మంత్రి అయి, అధికారాం అనుభ‌విస్తూ ఇప్ప‌డు అక్కడి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెలాగాట‌మాడుతూ వ్యాపారం చేస్తున్నాడు. ఇసుక మాఫియాలో కేటిఆర్ స‌మీప బంధువు, సోద‌రుడి వ‌ర‌స అయ్యే సంతోష్ కుమార్‌కు వాటాలున్నాయి. మేము  డాక్యుమెంట్ల‌తో స‌హా నిరూపించినా కూడా మాఫియాను ప్రోత్స‌హించే విధంగా వారికే స‌హాకారం అందిస్తున్నాడు,’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కెటిఆర్ ని ఆయన ఇసుక బకాసురుడని విమర్శించారు.  ద‌ళిత రైతు శంక‌ర్ మృతికి త‌న ప్ర‌గాడ సంతాపం వ్య‌క్తం చేశారు.  ప్ర‌భుత్వం శంక‌ర్ కుటుంబాన్ని అన్ని ర‌కాలుగా ఆదుకోవాల‌ని  డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios