పాము మీద పగతో.. దాని తల కొరికి నమిలేశాడు

First Published 20, Feb 2018, 2:43 PM IST
Man bites snake in Uttar Pradesh
Highlights
  • పాము తలకొరికి నమిలేసిన రైతు
  • అనంతరం కళ్లు తిరిగి పడిపోయిన రైతు

పాములు  మనుషులను కాటు వేయడం సహజం. కానీ.. మనిషి పామును కాటు వేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇలా ఎక్కడైనా జరుగుతుందా.. అని ఆశ్చర్యపోతున్నారా..? నిజంగానే జరిగింది. పాము మీద పగ పట్టి మరీ దానిని కొరికి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్లాపూర్ భగార్ గ్రామానికి చెందిన సోనేలాల్ అనే రైతు.. రోజులాగానే పొలానికి వెళ్లాడు. సోమవారం పొలంలో పశువులను మేపుతుండగా.. పాము కాటేసింది. దీంతో.. పాము మీద కోపంతో.. వెంటనే దాన్ని పట్టుకొని..పాము తల నవిలి చంపేశాడు. అనంతరం నవిలిన తలని ఊసేశాడు. అనంతరం కళ్లుతిరిగి అక్కడే పడిపోయాడు.

గమనించిన తోటి రైతులు అతనిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం అతను స్పృహ నుంచి బయటకు వచ్చాడు. విచిత్రం ఏమిటంటే.. అసలు పాము అతనిని కాటు వేయలేదట. కాటు వేసిందనుకుని భ్రమపడి అతను దానిని చంపేశాడు. పాము తలని కొరికినప్పుడు.. దాని తలలోని విషం కొద్దిగా కడుపులోకి చేరి.. కళ్లు తిరిగి పడిపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు.

loader