గుంటూరులో ఓ యువతిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది

man attacks woman with knife at guntur town
Highlights

అడ్డువచ్చిన యువతి తల్లి, చెల్లిపై కూడా

గుంటూరు జిల్లాలో ఓ యవతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వెంటపడుతున్నా యువతి పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడి ఏకంగా యువతి ఇంట్లోకి ప్రవేశించి మరీ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన యువతి తల్లీ, చెల్లెలిని కూడా కత్తితో  గాయపర్చాడు. ప్రస్తుతం యువతితో పాటు ఆమె తల్లీ, చెల్లి కేడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు పట్టణంలో నివాసముంటున్న కొండపల్లి శ్రీనివాస్,లక్ష్మి దంపతులకు రమ్య, సౌమ్య అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దమ్మాయి రమ్య ప్రస్తుతం అభ్యుదయ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సుభానీ అనే యువకుడు ప్రేమ పేరుతో రమ్య వెంటపడుతున్నాడు. ఇందుకు రమ్య ఒప్పుకోకపోడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. తన ప్రేమను కాదన్న రమ్యను హతమార్చాలని పథకం పన్నాడు. ఈక్రమంలో నిన్న రమ్య ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన రమ్య తల్లీ, చెల్లిని కూడా  గాయపర్చాడు. వీరి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు చేరుకునేలోపే సుభాని పరారయ్యాడు.

రక్తపు మడుగులో పడివున్న యువతితో పాటు గాయపడ్డ తల్లీ, చెల్లిని స్థానికులు  జీజీహెచ్‌కు ఆస్పత్రికి తరలించారు. రమ్యకు సర్జరీ అవసరం కావడంతో అత్యవసరంగా చేశారు. ఈ దాడికి పాల్పడిన యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

loader