ఓ మలయాళం మ్యాగజైన్ ముఖచిత్రం పై బిడ్డకు పాలు ఇస్తూ ఓ మోడల్ ఫొటోను ప్రచురించటం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లికాని మోడల్ తో బిడ్డకు పాలు ఇస్తూ.. ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తూ వినోద్ మాథ్యూ అనే న్యాయవాది కేసు వేశారు. కాగా.. న్యాయవాది పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం.. విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 

ఇదిలా ఉండగా.. పబ్లిక్ స్టంట్ కోసమే మోడల్ జోసెఫ్.. ఇలా ఫోటోకి పోజు ఇచ్చారంటూ.. పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శించడం మొదలుపెట్టారు. కొన్ని మీడియా  సంస్థలు కూడా ఇదే అర్థం వచ్చేలా వార్తలు ప్రచురించాయి. దీంతో.. ఈ విషయంపై మోడల్ జోసెఫ్ స్పందించారు. ఆ ఫోటో కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. అలాంటప్పుడు అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. గ్రాఫిక్ ఫోటోలని చూసే వారు, మంచి పని కోసం ఒరిజిన‌ల్‌గా చేస్తున్న దీనిని ఎందుకు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని విమ‌ర్శించింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ని గొప్ప క‌విగా పొగిడిన వారు ఇప్పుడు నీతి త‌ప్పిన దానిగా, వేశ్య‌గా ప్ర‌చారం చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.