తన బిడ్డకు పాలు ఇస్తూ.. ఓ మోడల్ మ్యాగజైన్ కవర్ కి ఇచ్చిన ఫోటో ఇప్పుడు వివాదంగా మారింది. కొందరు ఆ మోడల్ చేసిన దానిని వ్యతిరేకిస్తుంటే.. మరి కొందరు ఆమె మద్దతుగా నిలుస్తున్నారు. ఆ మ్యాగ్జిన్ కవర్ సంగతేంటో ఒకసారి చూద్దామా..

కేరళ రాష్ట్రానికి చెందిన మోడల్, రచయిత,ఎయిర్ హోస్టెస్ జోసెఫ్... ఇటీవల గృహలక్ష్మి అనే మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోకి పోజ్ ఇచ్చింది. అయితే.. ఆ ఫోటోలో.. జోసెఫ్.. తన బిడ్డకు పాలు  ఇస్తూ.. ఫోటోకి పోజ్ ఇచ్చింది. తల్లి బిడ్డల అనుబంధం, తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మ్యాగ్జిన్.. ఇలాంటి ఫోటోని కవర్ పేజీగా ప్రచురిచింది. అయితే.. ఈ ఫోటోపై మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాగజైన్ ఎడిటర్ పై చర్యలు తీసుకోవాలంటూ.. కొందరు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. దీనిపై జోసఫ్ స్పందించారు. కేవలం తల్లి బిడ్డల అనుబంధం తెలియజేయడానికే అలాంటి ఫోటోని కవర్ పేజీగా వాడరని ఆమె చెప్పారు. ఆ ఫోటోని మాతృత్వం కోణంలో చూడాలని.. నగ్నత్వంగా ఎందుకు చూస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.