కొంపముంచిన ‘ఇంటెల్’ చిప్స్

కొంపముంచిన ‘ఇంటెల్’ చిప్స్

ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్, టెక్నాలజీ కంపెనీ ‘ఇంటెల్’ గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ తయారీలో ఉపయోగించే దాదాపు అన్ని డివైజెస్ ని ఇంటెల్ సరఫరా చేస్తుంది.  అయితే.. ఇప్పుడు ఆ ఇంటెల్ డివైజెస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సమస్య వచ్చి పడింది.

విషయం ఏమిటంటే.. ఇంటెల్ కంపెనీ ప్రవేశపెట్టిన ‘ఇంటెల్ చిప్స్’ రూపకల్పనలో చాలా తప్పులు చేసింది. దీని కారణంగా మైక్రోసాఫ్ట్, లైనెక్స్, యాపిల్ కంపెనీలు తమ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని కంప్యూటర్లలో ఆపరేటింగ్ సిస్టమ్ లను అప్ డేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. గత పది సంవత్సరాలుగా ఆ ఇంటెల్ చిప్స్ ని కంప్యూటర్, ల్యాప్ టాప్ లలో వినియోగిస్తున్నారు.

ఈ విషయంపై యూకేలోని నేషనల్ సైబర్ సెక్యురిటీ సెంటర్ స్పందించింది. ఇంటెల్ చిప్స్ సమస్య ప్రాసెసర్లు కు మాత్రమే పరిమితం కాదని, దాని ఫిక్సింగ్ లోనూ సమస్య తలెత్తుందని హెచ్చరించింది. దీని కారణంగా చాలా మందికి నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇంటెల్ కంపెనీ కొత్తరకం సాఫ్ట్ వేర్, ఫర్మ్ వేర్ లను అప్ డేట్ చేస్తున్నట్లు చెప్పింది.

ఈ సమస్య అమేజాన్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ లపై కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ చిప్స్ వాడుతున్న మిలియన్ కంప్యూటర్లు హ్యాకింగ్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ఇప్పటి వరకు కొన్ని హ్యాకింగ్ కి గురవ్వగా.. దానికి ఇదే కారణం అయ్యి ఉండచ్చని భావిస్తున్నారు. చిప్స్  కారణంగా ఒకరి కంప్యూటర్ లో సమాచారాన్ని సులభంగా హ్యాకింగ్ చేయడం వీలౌతుందని సైబర్ నిపుణులు మైక్ గాడ్ ఫ్రే చెప్పారు. అంతేకాదు.. కంప్యూటర్ కర్నెల్ యాక్సెస్ చేయడానికి త్వరగా దోహదపడుతుందన్నారు. దీని ద్వారా కంప్యూటర్ యజమానికి తెలియకుండా దానిలోని సమాచారాన్ని చోరీచేయవచ్చు. లేదా ఇంకేదైనా చేయవచ్చని ఆయన చెబుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరిచేందుకు సాఫ్ట్ వేర్ నిపుణులు శతవిదాలా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ చిప్స్ ఉన్న కంప్యూటర్స్ పనితీరు 30శాతం వరకు పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఇంటెల్ షేర్స్ 6శాతం పడిపోయాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page