పాపం షారూక్ ఖాన్...ఎంత నష్టం జరిగింది

First Published 19, Mar 2018, 12:40 PM IST
Mahira Khans Raees becomes most pirated film of 2017
Highlights
  • బాలీవుడ్ కింగ్.. షారూక్ ఖాన్ గత కొంత కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఏవీ..ఆశించిన ఫలితం రావడం లేదు.

బాలీవుడ్ కింగ్.. షారూక్ ఖాన్ గత కొంత కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఏవీ..ఆశించిన ఫలితం రావడం లేదు. ఇదిలా ఉండగా.. షారూక్ సినిమా గురించి  ఇటీవల ఓ ఆసక్తికర విషయం బయటపడింది.  ఈ వార్త విని ఒక్కసారిగా బాలీవుడ్ జనాలు నోరువెల్లబెట్టారు. ఇంతకీ అసలు మ్యాటరేంటీ అంటే.. గతేడాది షారూక్ నుంచి ‘రాయీస్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై షారూక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.. కానీ బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. అయితే.. ఈ సినిమా ప్లాప్ కి అసలు కారణం పైరేట్ కావడమేనట.

అవును ఈ సినిమాని 6,187,369 సార్లు పైరేట్ అయ్యిందట. గతేడాది అత్యధికంగా పైరేట్ అయ్యిన సినిమా ఇదే. దీని తర్వాతి స్థానంలో కాబిల్, జాలీ ఎల్ఎల్ బి2 సినిమాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జర్మనీకి చెందిన ఓ సంస్థ తెలియజేసింది. ఈ వార్త విన్నవారంతా పాపం షారూక్ అంటున్నారు. సినిమా పైరెట్ కాకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా హిట్ గా నిలిచేదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇటీవల విడుదలై ఎక్కువగా పైరెట్ అయిన సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

రాయీస్.. 6,187,379 సార్లు

కాబిల్- 5,263,526 సార్లు

జాలీ ఎల్ఎల్ బీ2- 4,435,585సార్లు

టాయ్ లెట్-ఏక్ ప్రేమ్ కథా- 4,270,529 సార్లు

హాఫ్ గర్ల్ ఫ్రెండ్- 4,210,243 సార్లు

బద్రీనాథ్ కీ దుల్హానియా- 4,022,014 సార్లు

గోల్ మాల్ ఎగైన్- 3,832,369 సార్లు

ఒకే జాను-3,657,327 సార్లు

ది ఘాజీ ఎటాక్-3,429,706 సార్లు

జుడ్వా2-3,398,929 సార్లు పైరేట్ అయ్యాయి.

loader