నడుస్తున్న సమావేశాలకు కాకుండా ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా ను సస్పెండ్ చేయవచ్చా అనే వివాదం ఇంకా ముగియలేదు
మహారాష్ట్ర కూడా ఆంధ్రా దారిలోకి మళ్లింది.
నాలుగు రోజులు కిందట ఆర్థిక మంత్రి సుధీర్ ముంగుంటివర్ అసెంబ్లీలో బడ్జెట్ ను సమర్పిస్తున్నపుడు సభకుఅంతరాయంకల్గించారని 19 మంది ప్రతిపక్ష సభ్యులను ఏకంగా ఈ ఏడాది మొత్తం సస్పెండ్ చేశారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 31 ,అంటే దాదాపు తొమ్మిదినెలల పాటు, వారంతా సస్పెన్షన్ లో ఉంటారు.
ఆంధ్రాలో లాగే వారెవరూ అసెంబ్లీ ప్రాంగణంలో కూడ అడుగు పెట్టకుండా నిషేధం విధించారు.
ఇలా సభ్యులను ఒకఏడాది పాటు కొనసాగించడం మీద వైసిపి సభ్యురాలు ఆర్ కె రోజాను సస్పెండ్ చేసినపుడు చర్చనీయాంశమయింది. కొంతమంది పార్లమెంటు చట్టాలు తెలిసిన వాళ్లు, పార్లమెంటు వ్యవహారంలో అనుభవం ఉన్నవాళ్లు , ఇలా ఏడాది సస్పెండ్ చేయడం తప్పని, మహా అంటే నడుస్తున్న సెషన్ మొత్తం చేయవచ్చని చెపారు.
చివరకు రోజా వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఒక అయితేపరిష్కారం మాత్రం రాలేదు. ఆమె వ్యవహారం మీద వేసిన ప్రివిలేజెస్ కమిటీ విచారణ జరిపి మరొక ఏడాది పాటు కూడా ఆమెను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. సస్పన్షన్ సమయంలో ఆమెను అసెంబ్లీ ఆవరణలోకి కూడా అనుమతించలేదు. చివరకు వాళ్ల వైసిపి పార్టీ కార్యాలయానికి కూడా అనుమతించలేదు.
ఇపుడు, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి పాఠం నేర్చకున్నట్లు , స్పీకర్ హరిబాహు బగ్డే 19 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సస్పెండ్ చేశారు. ఇందులో 10 మంది కాంగ్రెస్, 9 మంది ఎన్‌సీపీ సభ్యులు ఉన్నారు. బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలు మంత్రి తీర్మానానికి మద్దతు తెలిపారు.
