Asianet News TeluguAsianet News Telugu

ఒంటరితనం ప్రమాదమే..!

  • మనుషుల్లో పెరిగిపోతున్న ఒంటరితనం
  • టెక్నాలజీ మోజులో పడిపోతున్న యువత
  • ఒంటరితనంతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
Loneliness a major threat to health

టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులు క్రమంగా ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల రాకతో కనీసం కుటుంబ సభ్యులతో కూడా కలవకుండా ఏదో ఒక సోషల్ మీడియాలో గడిపేస్తూ పక్కవారిని కూడా మర్చిపోతున్నారు. ఫలితంగా సామాజికంగా ఒంటరిగా మారిపోతున్నారు. చుట్టూ మనుషులున్నా మాట్లాడలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నారు. అయితే.. ఇదేవిధంగా కంటిన్యూ చేస్తే.. చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

ఎక్కవ సేపు ఒంటరిగా గడపడం అలవాటు చేసుకుంటే.. అది చివరికి మృత్యువుకి దగ్గర చేస్తుంది. దీని ఎఫెక్ట్ ముఖ్యంగా వయసు మళ్లినవారిపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుటుంబసభ్యులు ఎవరికి వారు.. తమ ఫోన్లతో బిజీబిజీగా గడిపేస్తూ.. ఇంట్లో ఉన్న పెద్దవారిని పట్టించుకోకపోతే వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు. కాలక్రమేణా ఆ ఒంటరితనం వల్ల వారికి గుండె జబ్బులు, అన్ని మర్చిపోవడం లాంటివి చేస్తుంటారట.

యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టిసినర్స్ ఛైర్మన్  ప్రొఫెసర్ హెలెన్ స్ట్రోక్స్ ల్యాంపర్డ్ ఈ విషయంపై పలు పరిశోధనలు చేశారు. గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిక్స్ వంటి జబ్బులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే వారిలో చాలా మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు గుర్తించామని ప్రొఫెసర్ హెలెన్ చెప్పారు.

అలాంటివాళ్లతో ప్రేమగా మాట్లాడేవాళ్లు చాలా అవసరమని ఆయన తెలిపారు.వారు చెప్పేది ఓపికగా వింటూ.. వారితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపితే అంతకు మించిన వైద్యం ఏదీ ఉండదని హెలెన్ పేర్కొన్నారు.

యూకే 65ఏళ్ల వయసుదాటి ఒంటరితనంతో బాధపడివాళ్లు 1.1 మిలియన్ల మంది ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండేవారితో పోలిస్తే.. ఒంటరితనం అనుభవించే వారే ఎక్కువ శాతం మృత్యువాతపడుతున్నారు. కేవలం యూకేలో మాత్రమే కాదు.. మన దేశంలోనూ ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నవారు చాలా  మందే ఉన్నారు. కాబట్టి.. ఇకనైనా ఇంట్లోని మీ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలతో కాస్త సమయం గడిపి వారిని సంతోషంగా ఉంచండి.

Follow Us:
Download App:
  • android
  • ios