ఆంధ్ర ప్రదేశ్ ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్విజర్లాండ్ లోని దావాస్ లో జరిగే ప్రపంచ అర్థిక సదస్సు (డబ్ల్యు ఇ ఎఫ్) కు హాజరవుతున్నారు. ఈమేరకు ఆయనకు  ఆహ్వానం అందింది. నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ నెల 23 నుండి 26 వరకూ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ఆయన   దావా స్ వెళతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. ఈ సారి లోకేశ్ కు ఆహ్వానం రావడం విశేషం. లోకేశ్ పర్యటన వివరాలు అందాల్సి ఉంది.