కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సెక్రెటరీ జితేందర్ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ అమర్జీత్ సిన్హా లతో సమావేశం 

నారాలోకేశ్ ఒక కీలకమయిన అజండాతో ఢిల్లీ వెళ్తున్నారు. నిధుల విడుదల విషయంలో జరుగుతున్న జాప్యం గురించి ఆయన కేందంతో చర్చిస్తారు.గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఆయన కేంద్రం దృష్టి కి తీసుకురానున్నారు.

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సెక్రెటరీ జితేందర్ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ అమర్జీత్ సిన్హా లతో సమావేశమయి నిధుల విడుదల గురించి వత్తిడి తీసుకురాబోతున్నారు.


ఉపాధిహామీ పథకంలో రాష్ట్రానికి మెటీరియల్ బడ్జెట్ కింద రు. 1351.81 కోట్లు,
లేబర్ బడ్జెట్ కింద రు.600 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదల కావలసి ఉంది.

గత ప్రభుత్వ హయాంలో 2207 నివాస ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేకపోయినా ‘కనెక్టెడ్ హ్యాబిటేషన్స్’ గా కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. వాటిని తిరిగి రోడ్డు సౌకర్యం లేని నివాస ప్రాంతాలుగా గుర్తించాలి. ఈ ప్రాంతాలకు రోడ్డుకనె క్టివిటి కోసం4772 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరాగాలి. దీనికి రు.3185 కోట్ల రుపాయలు ఖర్చువుతాయి. దీనికి కేంద్ర సహాయం కావాలని నేను కోరుతాను,’ అని ఆయన అమరావతిలో చెప్పారు. 

ఇదే విధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ్ ఆంధ్ర కార్పోరేషన్ కు రావాల్సిన రెండో విడత నిధులు 165 కోట్లు విడుదల చెయ్యాలని కూడా మంత్రి నారా లోకేష్ కేంద్రాన్ని కోరతారు.

ఇదేవిధంగా జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా పథకం కింద రావాల్సిన నిధులు,సోలార్ ఆధారిత నీటి సరఫరా పథకం రావాల్సిన నిధులు విడుదల చేయడంతో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కూడా లోకేష్ ఢిల్లీ పెద్దలను కోరతారు.