రాజకీయాల్లోకి అడుగుపెట్టటం వారసత్వ హోదాలోనే వచ్చినా సామర్ధ్యాన్ని కెటిఆర్ నిరూపించుకున్నారు. కానీ లోకేష్ కు మాత్రం అసలైన పరీక్ష ఇపుడే ఆరంభమైంది.

యాధృచ్చికమో ఏమో గానీ రెండు రాష్ట్రాల్లో ఓ పోలిక ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏపిలో మంత్రివర్గ ప్రక్షాళనైన దగ్గర నుండి ఈ పోలికలు మరీ ఎక్కువైపోయాయి. కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కు చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్ కు పోలికలు ఇపుడు బాగా చక్కర్లు కొడుతున్నాయ్. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఒకేసారి ఏర్పడ్డాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కెటిఆర్ మంత్రిగా బాధ్యతలు తీసుకుని దూసుకుపోతున్నారు. దాంతో ఏపిలో కూడా చంద్రబాబుపై ఒత్తిడి మొదలైంది.

లోకేష్ కూడా ఎందులోనూ తక్కువ కాదని, కాబట్టి లోకేష్ కు కూడా మంత్రిపదవి ఇవ్వాల్సిందేనంటూ ఇంటా బయటా సిఎంపై ఒత్తిళ్లు పెరిగిపోయాయి. దాంతో మూడు రోజుల క్రితమే మంత్రివర్గ ప్రక్షాళన జరిగటం, లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకోవటం అందరికీ తెలిసిందే.

అయితే, తెలంగాణాలో కెటిఆర్ నిర్వహిస్తున్న ఐటి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలే లోకేష్ కూడా కేటాయించారు. దాంతో ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో పోలికలు ఎక్కువైపోయాయి. కెటిఆర్ మంత్రిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టటం వారసత్వ హోదాలోనే వచ్చినా సామర్ధ్యాన్ని కెటిఆర్ నిరూపించుకున్నారు. కానీ లోకేష్ కు మాత్రం అసలైన పరీక్ష ఇపుడే ఆరంభమైంది.