Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ నెంబర్ తో ఆధార్ అనుసంధానం.. ప్రజల్లో గందరగోళం..

  •  ప్రజల్లో గందరగోళం..
  • ఆధార్ తో అనుసంధానానికి ప్రజల అనాసక్తి..
Linking Aadhaar to mobile numbers finds few takers

 

ఆధార్ తో మీ మొబైల్ నెంబర్ ను అనుసంధానం చేశారా..? అసలు ఆధార్ అనుసంధానం అవసరమా? చెయ్యకపోతే ఏం జరుగుతుంది...? ఇలాంటి ప్రశ్నలే ప్రస్తుతం ప్రజల్లో తలెత్తుతున్నాయి. మీ మొబైల్ ఫోన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానం చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.  కాగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు పెద్దగా స్పందించడం లేదనిపిస్తోంది.

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్లు లేని వారు ఉండరు అనడంలో ఆశ్చర్య  పడాల్సింది లేదు. దేశంలోని ప్రజలందరూ తమ మొబైల్ ఫోన్ ని ఆధార్ అనుసంధానం చేయించుకోవాలంటే.. సమీపంలోని టెలికాం సెంటర్ కి వెళ్లాలి. ఈ లెక్కన.. టెలికాం సెంటర్లు జనాలతో కిక్కిరిసి పోవాలి. కానీ అలా జరగడం లేదు. రోజు మొత్తంలో 40మంది కూడా తమ ఫోన్ నెంబర్ ని ఆధార్ తో లింక్ చేసుకోవడానికి రావడం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ టెలికాం సంస్థకు చెందిన ఓ ఉద్యోగి తెలిపారు.

ఒకవేళ.. ఈ ఆధార్ అనుసందాన ప్రక్రియ ఏమైనా.. గంటల తరబడి జరిగేదా అంటే.. అదీ లేదు. కనీసం 5 నిమిషాలు కూడా పట్టదు. వేలిముద్రలు, పలు సమాచారం అడిగి అనుసంధానం చేస్తారు. అయినా సరే.. దీనికి ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు.

‘నేను ఇటీవల నా ఫోన్ నెంబర్ ని ఆధార్ తో అనుసంధానం చేయించాను. వారం రోజుల తర్వాత.. టెలికాం సంస్థ నుంచి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీరు మీ మొబైల్  నెంబర్ ని ఆధార్ తో అనుసంధానం చేయించుకోవాలనే నిర్ణయానికి కట్టుబడే ఉన్నారా అంటూ వారు అడిగారు. అందుకే కదా చేయించుకుంది. మళ్లీ ఈ ప్రశ్నలేంటి’ అని ఓ వ్యాపారవెత్త తెలిపారు.

‘ అసలు ఆధార్ అనుసంధానం అవసరం లేదని మా అపార్ట్ మెంట్ లో వాళ్లు చెబుతున్నారు. అయితే దీనిపై కస్టమర్ కేర్ వాళ్లని సంప్రదించగా.. వారు ఎలాంటి ఖచ్చితమైన సమాధానం చెప్పలేదని’ ఓ గృహిణి తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ విషయంలో టెలికాం సంస్థలకు మాత్రం కాస్త ఆదాయం కలుగుతోంది. అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆధార్ అనుసంధానం చేయిస్తున్నారు. అలా చేయడానికి టెలి కాం సంస్థలు వారి వద్ద నుంచి కొంత మనీ తీసుకుంటున్నారు.

ఆధార్ అనుసంధానం చేయిస్తే.. ఒక్కో వ్యక్తి నుంచి రూ.20వరకు తీసుకుంటామని టెలికాం కంపెనీలో పనిచేసే వర్కర్లు చెబుతున్నారు. దీని వల్ల ఒక్కోసారి రోజుకు రూ.1000 వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కొన్ని సమయాల్లో తాము వేరే కంపెనీలకు వెళ్లి మరీ ఈ సేవలను అందిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇందు కు కూడా తాము కొంత మొత్తాన్ని స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

కొంత నిర్లక్ష్యం.. కొంత అవగాహన లోపం కారణంగా..ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానంలో జాప్యం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios