క్రికెటర్ శ్రీశాంత్ కి కేరళ హైకోర్టులో కూసంత వూరట లభించింది నిషేధాన్ని ఎత్తివేయాలని న్యాయస్థానం ఈ రోజు బీసీసీఐని ఆదేశించింది.
క్రికెటర్ శ్రీశాంత్ కి కేరళ హైకోర్టులో కూసంత వూరట లభించింది. ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని న్యాయస్థానం ఈ రోజు బీసీసీఐని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. 2013వ సంవత్సరంలో ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారంటూ శ్రీశాంత్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీశాంత్ పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆయన గత ఏడాది మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది. స్పాట్ ఫి క్సింగ్
కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలతో 2013 మేనెలలో శ్రీశాంత్ తోపాటు అజిత్ చండీమాల్, అంకిత్ చవాన్ లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని తీహార్ జైలుకు పోలీసులు తరలించగా.. శ్రీశాంత్ బెయిలుపై బయటకు వచ్చారు. కాగా.. తాజాగా.. ఆయనపై నిషేధం విధించాలని కేరళ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
