ఎల్జీ నుంచి జబర్దస్త్ మొబైల్ ఫోన్ వచ్చేసింది

ఎల్జీ నుంచి జబర్దస్త్ మొబైల్ ఫోన్ వచ్చేసింది

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఎల్జీ మరో కొత్త మోడల్ ఫోన్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఎల్జీ వీ30ప్లస్ పేరిట ఈ ఫోన్ ని విడుదల చేసింది. ఎల్జీ గతంలో విడుదల చేసిన వీ30కి కొనసాగింపుగా ఈ ఫోన్ ని విడుదల చేశారు. వీ30, వీ30ప్లస్  రెండు ఫోన్ లలోనూ స్టోరేజ్ సామర్థ్యం తప్ప మరే వ్యత్యాసం లేకపోవడం గమనార్హం. వీ30కన్నా ఎక్కువ స్టోరేజ్ కేపాసిటి ఎక్కువగా ఉంది.

రూ. 44,990 ధర నిర్ణయించింది. డిసెంబర్‌ 18నుంచి విక్రయాలు మొదలు కానున్నాయిని ఎల్‌జీ  వెల్లడించింది. అలాగే  ఫ్రీ వైర్‌లెస్‌ చార్జర్‌, స్ర్కీన్‌ రీప్లేస్‌ మెంట్‌గ్యారంటీ కూడా అందిస్తోంది. డ్యుయల్‌ రియర్‌ కెమరాలు,  భారీ స్టోరేజ్‌,  ఎఫ్‌ 1.6 భారీ ఎపర్చర్,  క్లిస్టర్‌ క్లియర్‌ గ్లాస్‌‌, హై ఫై వీడియో రికార్డింగ్‌ తమ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ ఫోన్‌  ప్రత్యేకతలుగా లాంచింగ్‌ సందర్భంగా ఎల్‌జీ పేర్కొంది. ఈ ఫోన్ ని ఐఎఫ్ఏ 2017లో తొలిసారి విడుదల చేయగా.. అధికారికంగా బుధవారం విడుదల చేశారు.

 

ఎల్‌జీ వీ 30 ప్లస్‌ స్పెసిఫికేషన్స్

6   అంగుళాల డిస్‌ప్లే 

1440x2880పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.2

క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్‌ 835 ఎస్ ఓసి

4జిబి ర్యామ్

128  జీబీ స్టోరెజీ

2జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం

రెండు వెనుక కెమేరాలు( 16మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్)
5 ఎంపీ ఫ్రంట్‌కెమెరా

3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page