Asianet News TeluguAsianet News Telugu

టిడిపి పరువు పోతే పోయింది, విశాఖకు మేలు జరిగింది

మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వం పరువును విశాఖ మంత్రులు అయ్యన్న పాత్రుడు,గంటా శ్రీనివాసరావు ఇద్దరు కలిసి బంగాళా ఖాతంలో కలిపారు. అయితే, వారు తగవులాడి విశాఖకు ఎనలేని  మేలు చేశారు. విశాఖ ప్రజలను నిద్రలేపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ విలువైన భూసంపదకు భద్రత లేదని,  ముప్ప వచ్చిందనే వాస్తవం ప్రజల ముందు పెట్టారు. జిల్లా కలెక్టర్ , బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు  దానిని ధృవీకరించారు.

let the ministers squabble help Vizag preserve its precious land from loot

మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వం పరువును విశాఖ మంత్రులు అయ్యన్న పాత్రుడు,గంటాశ్రీనివాసరావు ఇద్దరు కలిసి బంగాళా ఖాతంలో కలిపారు. అయితే, వారు తగవులాడి విశాఖకు ఎనలేని  మేలు చేశారు. విశాఖ ప్రజలు నిద్రలేపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ విలువైౌన భూసంపదకు ముప్ప వచ్చిందనే వాస్తవం గ్రహించారు. వాటిని కాపాడుకునేందుకు బెటర్ విశాఖ వంటి సంస్థలు ప్రతిపక్షపార్టీలు పోరాటాన్ని ఉధృతం చేయవచ్చు.

 

తెలుగుదేశం మంత్రులిద్దరు బురదచల్లుకోక పోయివుంటే, వాళ్లి ద్దరు మునుపటిలా  ప్రాణమిత్రుల్లా విశాఖ సామ్రాజ్యాన్ని  ఏలుతూ ఉంటే ఏమయివుండేదో వూహించడమే కష్టం.

 

మొత్తానికి వారిరువురి వైరం వల్ల దేశానికి మేలు జరిగింది. వారిరువురు బజారుకెక్కడం వల్లే గదా విశాఖలో 20 వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ప్రకటించాల్సి వచ్చింది.  కలెక్టరే 20 వేల కోట్లంటే, ఒరిజినల్ లెక్కలు లక్ష కోట్లున్నా ఆశ్చర్యం లేదు.

 

అయితే,  ఈ భూకుంభకోణంలో  పెద్ద బాబుల పాత్ర ఏమిటో తెలియాలి.ఎందుకంటే పైవాళ్ల అండదండలు లేకుండా మంత్రులేమీ చేయలేరు. ఇపుడు టిడిపి ప్రభుత్వంలో ఉన్న కేంద్రీకృత అజామాయిషీలో ఆర్డీవో ట్రాన్స్ ఫర్ కూడా మంత్రులు చేయించలేరు. ఆర్డీవో ల బదిలీలను ఒక జివొ విడుదల చేసి రెవిన్యూ మంత్రి పరిధిలోనుంచి ముఖ్యమంత్రి తీసేసుకున్నారు. కాబట్టి భూముల రికార్డుల సృష్టించాలంటే ఇపుడు పైనుంచి ఆమోదం రావాలి. కనీసం పైవారికి తెలియచేయాలి.

 

 ప్రభుత్వం ప్రతిష్ట మంట కలిసినినా పర్వాలేదు. ప్రజల సొత్తు అయిన విశాఖ భూములు పదిలంగా ఉండాలి. ఇలా పెద్ద మనుషులు దోచుకోవడాకి వీల్లేదు.

 

విశాఖ తెలుగుదేశం నేతలు చాలా అక్రమాలకు పాల్పడ్డారని మిత్రపక్షంలో ఉన్న బిజెపి శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు కూడా చెబుతున్నారు. ఈ భూ కుంభకోణంలో అనేక కోణాలను వెలుగులోకి తెచ్చింది ఆయనే.  ఆయనా ప్రభుత్వాన్ని దుమ్ముదులిపారు.

 

 విశాఖ జిల్లాలో ల్యాండ్ స్కామ్ బయటపడింది,మంత్రుల మధ్య ఉన్న అసూయ వల్లే. ఆసూయతో వచ్చిన  ఈ వైషమ్యం వల్లే కదా మంత్రి అయ్యన్న పాత్రుడు కుంభకోణంలోని ఎన్నో వాస్తవాలను మీడియా ముందుంచింది. ఏమయితేనేముంది,  ఒక మంత్రిగురించి ఆసక్తి కరమయిన విషయాలు ఆయన వెల్లడించారు. 

గంటా పాత్ర ఇంతగా బహిరంగమయినా, ముఖ్యమంత్రి ఒక్క మాటకూడా అనలేకపోతున్నారు.దోషులను శిక్షిస్తామని మీడియాలో చెప్పి తప్పించుకుంటున్నారు.

 

ఇపుడు విశాఖ ల్యాండ్ స్కామ్‌పై విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. అది ఎందుకూ పనికిరాదని చెప్పడానికి లా పాయింట్‌ వెతకాల్సిన అవసరం లేదు. బజార్లో బజ్జీలమ్ముకునే వాళ్లు  కూడా ఇలాంటి దర్యాప్తులేమవుతాయో చెబుతారు. 

 

 ఇప్పుడు మంత్రి గంటా రాసిన లేఖలో ఇదే వెల్లడించారు.

 

ఈ భూ కుంభకోణంపై సిఐడి, లేదా సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.  అంటే...సిట్‌పై ఆయనకు కూడా నమ్మకం లేనట్టే కదా?

 

ఇంతకీ విశాఖలో ఏం జరగుతూందో ఎప్పటికయినా బయటకు వస్తుందా?

 

బాంకుల రుణాలు ఎగ్గొట్టిన కేసుల ఇరుక్కున మహానుభావులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో హైదరాబాద్ భూదందాలు చేసినోళ్లు, విశాఖ భూములు కాజేసినోళ్ల... ఘరానాలతో   టిడిపి నిండిపోతావుంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios