ఈ చిరుత జనాలను ఎలా ఆటాడుకుందో చూడండి (వీడియో)

leopard enters into residential colony in utterpradesh
Highlights

  • జనారన్యంలోకి వచ్చిన చిరుత
  • పరుగులు తీసిన ప్రజలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నో లోని ఔరంగాబాద్ లో చిరుత పులి సంచరించింది. నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలోకి ఒక్కసారిగా చిరుత పులి రావడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే దాని బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఆ చిరుతపులి కూడా.. అంత మంది జనాలని చూడటం మొదటిసారి కాబోలు.. అది కూడా అడ్డదిడ్డంగా పరుగులు తీసింది. కొందరు యువకులు కర్రలు పట్టుకొని మరీ ఆ చిరుతను వెంబడించారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. సమీపంలోని అడవి నుంచి పొరపాటున చిరుత జనాల్లోకి వచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

 

కాగా.. చిరుత ఒక్కసారిగా నగరంలోకి వచ్చేసరికి బయటకు వెళ్లడానికి ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. చిరుత విషయమై స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

loader