లెనోవో కే8 ప్లస్ స్మార్ట్ ఫోన్ పై భారీ ధర తగ్గింపు

First Published 5, Apr 2018, 11:28 AM IST
Lenovo K8 Plus Available With Limited Period Discount on Flipkart
Highlights
ఇప్పుడు మరింత తక్కువ ధరకే లెనోవో స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ లెనోవో.. వినియోగదారులకు ఓ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన కే8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. గతేడాది సెప్టెంబర్ లో లెనోవో ఈ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్ని తొలిసారి విడుదల చేసినప్పుడు దీని ధర రూ.9,999గా ఉండేది. తాజాగా దీనిపై రూ.2వేలు తగ్గించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర రూ.7,999కు చేరుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్  ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది.

లెనోవోకే8 ప్లస్ ఫోన్ ఫీచర్లు...

5.2 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

loader