ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ లెనోవో భారత మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. కె6, కె5 ప్లే పేరిట ఈ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు ఫోన్లూ బడ్జెట్ ధరలోనే విడుదల చేయడం విశేషం. మరికొద్ది రోజుల్లో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. లెనోవో కే5 రూ.9,261 ధరకు లభ్యం కానుండగా, కే5 ప్లే రూ.7,200 ధరకు లభించనుంది. 

లెనోవో కే5 ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవో కే5 ప్లే ఫీచర్లు..

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.