Asianet News TeluguAsianet News Telugu

ఆ మూడో శపథం ‘ఇంగ్లిష్’ కోసమేనట

జైళ్లో ట్యూటర్ ను పెట్టుకున్న శశికళ

Learning English one of Sasikalas three oaths at Ammas grave

తమిళనాట జయలలిత మృతి తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఆమె పార్టీ నిలువునా చీలిపోయి మనుగడే కష్టంగా మారుతోంది. చిన్నమ్మ శశికళ అత్యాశే పార్టీని నాశనం చేసిందని చాలా మంది అభిప్రాయం. అమ్మ బతికున్నప్పుడు ఆమెకు సహచరిగా తలలో నాలుకలా వ్యవహిరించిన శశికళ చిన్నమ్మగా అందరి మన్నలను పొందారు.

 

అయితే జయలలిత మృతి తర్వాత చిన్నమ్మ లో సీఎం కావాలన్న ఆకాంక్ష బలం పడింది. దానికి అనుగుణంగా అమ్మలాగే నడవడిక మార్చుకుంది. అమ్మ పథకాలనే కొనసాగించాలనుకుంది. కానీ, విధి అక్రమాస్తుల కేసు రూపంలో ఆమెపై పగబట్టింది. కోర్టు దోషిగా తేల్చడంతో ఇప్పుడు జైలు ఊసలు లెక్కపెట్టాల్సి వస్తోంది. అయితే తాను జైలుకెళ్లడడానికి కారణం ఏంటో చిన్నమ్మకు బాగా తెలుసు అందుకే వారిపై ప్రతికారం తీర్చుకునేందుకు ఆమె ఎప్పుడో ప్రణాళికలు తయారు చేసింది. జైలుకు వెళ్లేముందు అమ్మ సమాధిపై శపథం చేస్తూ మూడు సార్లు బలంగా కొట్టింది.

 

ఆ రోజు చిన్నమ్మ ఆమ్మ సమాధిపై అలా ఏం శపథం చేసి కొట్టింది ... ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.కానీ, జైళ్లో ఉన్న చిన్నమ్మను చూశాక చాలా మంది ఆమె శపథం చేసింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

 

అమ్మతో అన్ని విషయాల్లో సమానంగా ఉన్న ఇంగ్లీష్ లో మాత్రం శశికళ చాలా వీక్ అట.  కేంద్రంలో చక్రం తిప్పాలన్నా... జాతీయ పార్టీ నేతలతో రాయభారం నడపాలన్న ఇంగ్లీష్ వచ్చితీర్సాల్సిందే. ఈ విషయంలో జయలలిత చాలా ఫాస్ట్. తమిళంతో పాటు ఆమె ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలరు. కానీ, శశికళ అలా కాదు. 10 వ తరగతితోనే బడిమానేసిన చిన్నమ్మకు తమిళతప్ప ఇంకో భాష కూడా రాదు. అదే ఇప్పుడు ఇబ్బంది మారినట్లు తెలుసుకుంది. అందుకే తాను శిక్ష అనుభవిస్తున్న జైళ్లోనే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ ట్యూటర్ ను కూడా పెట్టుకుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios