జాతీయ పార్టీలపై సెటైర్లు వేస్తూ మావోల స్కిట్ ప్రధాని మన్ కీ బాత్ ను ఇమిటేట్ చేసిన మావోయిస్టు అడవుల్లో దొరికిన డంప్ లో పెన్ డ్రైవ్ వీడియోలు
తాడిత పీడిత ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం అడవుల్లో పోరాడే అన్నలకు ఆయుధం పట్టడటమే కాదు అద్భుతంగా సెటైర్లు వేయడం కూడా వచ్చని తెలిసింది.
రాజ్యహింసకు వ్యతిరేకంగా తుపాకీతో పోరాడటమే కాదు మిమిక్రీతో రాజకీయ పార్టీలను ఆడుకోవడం కనిపించింది.
ఈ వీడియో చూస్తే అన్నల్లో అద్భుత కళాకారులను తనవితీరా చూడొచ్చు.
బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, డీఎంకే, ఏఐడీఎంకే ఇలా ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీలపై సెటైర్లు వేస్తూ అద్భుతంగా సాగింది ఈ మావోల స్కిట్.
ఓ మావోయిస్టు.. దివంగత సీఎం జయలలిత అభివాదాన్ని ఇమిటేట్ చేస్తూ అలరించగా, మరో మావోయిస్టు.. ప్రధాని మన్ కీ బాత్ ను ఇంగ్లీష్ లోకి అనువదించి సెటైర్ వేశారు.
మన్ కీ బాత్ ను ఇంగ్లీష్ లో కాస్త కోతి స్నానం అనాలని కొత్త అర్థం చెప్పాడు.
తమిళంలో సాగిన ఈ స్కిట్ ను గుర్తుతెలియని అడవుల్లో వీడియో తీసుకున్నారు.
నీలంబూర్ అటవీ ప్రాంతంలో గత నవంబర్ 24 న కేరళ పోలీసులు ఒక డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న పెన్ డ్రైవ్ లో 40 నిమిషాల ఈ వీడియో బయటపడింది.
