మరో వారం రోజుల్లో న్యాయవాదుల ప్రపంచ కప్ 8 దేశాల నుండి 12 జట్లు పాల్గోంటున్నాయి. భారత్ నుండి రెండు జట్లు.

ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రెజ్ అంతా ఇంతా కాదు, గ‌ల్లీ స్థాయి నుండి జాతీయ స్థాయి వ‌ర‌కు ఎక్క‌డ క్రికెట్ గురించి మాట్లాడిన భార‌తీయులు గంట‌లు గంట‌లు మాట్లాడ‌గ‌ల దిట్ట‌లు. చిన్న పిల్లాడి ద‌గ్గ‌రి నుండి రెపోమాపో కాటికి కాలు చాసిన ముస‌లాడి వ‌ర‌కు క్రికెట్ అంటే ఒక మ‌తంలా భావిస్తారు.

క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ అంటే మ‌న జాతీయ జ‌ట్టు అనుకుని పొర‌బాటు ప‌డెరు.. ఇది కూడా ప్ర‌పంచ క‌ప్‌, ప్ర‌పంచ దేశాలు పాల్గోంటారు, కానీ కానీ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్‌. 6 వ న్యాయవాది క్రికెట్ ప్రపంచ కప్ ఆగష్టు 10 నుండి 20 వరకు శ్రీలంకలో జరుగుతుంది. శ్రీలంక న్యాయవాదుల క్రికెట్ క్లబ్ ఈ ప్రఖ్యాత టోర్నమెంట్ ను మొదటిసారిగా ఆథిత్యం ఇస్తుంది. 


న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ లో మొత్తం 8 దేశాల నుండి 12 జ‌ట్టు పాల్గోంటున్నాయి. భార‌త్‌, శ్రీలంక‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల నుండి రెండు జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభ‌మ‌వుతున్నాయి. శ్రీలంక లో ప‌ది రోజుల పాటు మ్యాచ్ లు జ‌రుగుతాయి. 37 మ్యాచ్ లు జ‌రుగ‌నున్నాయి. ఈ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ ‌ థీమ్ "ఫ్రెండ్షిప్ కోసం క్రికెట్" 

మొట్ట‌మొద‌టి లాయ‌ర్ల ప్ర‌పంచ క‌ప్ 2007 లో హైదరాబాద్ జ‌రిగింది. ఒక సాధార‌ణ టోర్నీగా ప్రారంభ‌మైన ఈ ప్ర‌పంచ క‌ప్ నేడు అంత‌ర్జాతీయ టోర్నీగా మారింది. మూడ‌వ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ లో ఇండియా టీం విజేత‌గా నిలిచింది. అయితే ఈ ప్రారంభ వేడుక‌ల‌కు శ్రీలంక గౌరవనీయమైన చీఫ్ జస్టిస్ ప్రియాసత్ డిప్ చేతుల మీదుగా ప్రారంభ‌మ‌వుతుంది. ముఖ్య అథితిగా మాజీ ప్రపంచ కప్ విజేత శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణ‌తుంగా వ‌స్తారు. ఇండియా నుండి రెండు జట్లు పాల్గొంటున్నాయి.

న్యాయవాదుల క్రికెట్ ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్నది మన దేశం సిఎల్పి ప్రేసిడెంట్ సంతాన కృష్ణ. ఆయన మాట్లాడుతు ఈ ప్రపంచ కప్ లో ఇండియా జట్లు తప్పకుండా విజయం సాధిస్తాయని తెలిపారు.