నేను పాదయాత్ర చేస్తానంటే చట్టం తన పని చేసుకు పోతుందంటూ బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకొనే పరిస్థితి లేదు. అదే వుంటే ముఖ్యమంత్రిగారు ఈ పాటికి జైల్లో వుండేవారు.
ఆరు నూరైనా జూలై 26 నుంచి చలో అమరావతి నిరవథిక పాదయాత్ర జరిపి తీరుతా నని కాపు రిజర్వేషన్ ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.
ముద్రగడ పద్మనాభం విషయంలో ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది,’ పదే పదే హోం మంత్రి చిన్న రాజప్ప అనడం మీద ఆయన ఈ రోజు స్పందించారు.
‘నేను పాదయాత్ర చేస్తానంటే చట్టం తన పని చేస్తుందంటూ బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకొనే పరిస్థితి లేదు. అదే వుంటే ముఖ్యమంత్రిగారు ఈపాటికి జైల్లో వుండేవారు,’ అని ముద్రగడ అన్నారు.
కాపు రిజర్వేషన్ ఫలాన్ని చంద్రబాబు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని ఆయన విమర్శించారు.
‘ఎన్నికల ముందు ఈ సమస్యను మళ్లీ లేవదీసి కాపు ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు . కాపులని చంద్రబాబు విభజించి పాలిస్తున్నారు.. జూలై 26 లోగా రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం తేల్చాలి. లేదంటే పాదయాత్ర ద్వారా చావో రేవో తేల్చుకుంటాం,’ అని ముద్రగడ అన్నారు.
‘నేను వెనుక కి తగ్గే ప్రసక్తే లేదు. చంద్రబాబుకి మతి మరుపు వ్యాథి వచ్చిందని అంటున్నారు . మా సమస్య గుర్తు చేయఢానికే ఈ పాదయాత్ర. ఒంటరిగా అయినా సరే పాదయాత్ర చేసి తీరతా. నాది నిరవధిక పాదయాత్ర. ఇది ఎఫ్పటికి ముగుస్తుందో ముందే చెప్పలేను .పోలీసులు ఆపితే ఆగి. జైలుకు పంపితే బెయిల్ మీద వచ్చి పాదయాత్ర పూర్తి చేస్తాం- ముద్రగడ పద్మనాభం,’ అని హెచ్చరిక చేశారు.
