బడ్జెట్ ధరలో లావా తాజా స్మార్ట్ ఫోన్

LAVA 'Z91' launched in India for Rs 9,999
Highlights

ఈ ఫోన్ పై ఎయిర్ టెల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ లావా.. భారత మార్కెట్లోకి మరో తాజా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. సరిగ్గా వారం రోజుల క్రితం లావా జెడ్50 మోడల్‌ని విడుదల చేసిన లావా తాజాగా జెడ్91 పేరుతో మరో మోడల్‌ని రిలీజ్ చేసింది.

బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ మోడల్ 5.7 అంగుళాల 18:9 ఆస్పెక్ట్ రేషియో కలిగిన స్క్రీన్తో 1440×720 పిక్సెళ్ల రిజర్వేషన్ కలిగి ఉంటుంది. ఫోన్ ముందుభాగం 2.5D కర్వ్‌డ్ గ్లాస్ ఏర్పాటుచేశారు. ఫోన్ వెనుక భాగం ఖరీదైన వాచ్‌లను తయారు చేయడానికి వాడే గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు.

మీడియా టెక్ ఎంటి 6739 చిప్‌సెట్ ఈ ఫోన్లో నిక్షిప్తం చేశారు. 3GB ర్యామ్ కలిగి ఉన్న ఈ ఫోన్లో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తోంది. మెమరీ కార్డు ద్వారా అదనంగా 128 GB వరకూ స్టోరేజ్ పొందొచ్చు. ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా Bokeh modeని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం తీసిన ఫొటోలకు బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేయబడుతుంది అన్నమాట. అలాగే ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా లభిస్తోంది.

3000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, ఫేస్ అన్ లాక్ సదుపాయం ఉంది. కేవలం 0.7 సెకన్లలో ఫోన్‌ అవుతుంది. 9,999 రూపాయల ధర కలిగిన ఈ లావా ఫోన్ ఏప్రిల్ 15 నుండి దేశవ్యాప్తంగా లక్షకుపైగా రిటైల్ స్టోర్లలో విక్రయించబడుతుంది.

రెండేళ్ల వారెంటీ కలిగిన ఈ ఫోన్ కి ఎయిర్ టెల్  సంస్థ 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అలాగే కొనుగోలు చేసిన తేదీ నుండి సంవత్సరంలోపు ఒకసారి పూర్తి ఉచితంగా స్క్రీన్ మార్పిడి చేయించుకోవచ్చు.

loader