భారత మార్కెట్ లోకి సరికొత్త లాండ్ రోవర్

First Published 20, Jan 2018, 3:05 PM IST
Land Rover Launches Range Rover Velar In India
Highlights
  • లాండ్ రోవర్ నుంచి మరో కొత్త మోడల్ కారు
  • రేంజ్ రోవర్ వేలార్ పేరిట భారత మార్కెట్లో అడుగుపెట్టిన లాండ్ రోవర్

ప్రముఖ లక్జరీ కార్ల తయారీ సంస్థ లాండ్ రోవర్.. భారత మార్కెట్ లోకి  సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టింది. రేంజ్ రోవర్ వేలార్ పేరిట ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.78.83 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. గతేడాది డిసెంబర్ నెల నుంచే ఈ కారు బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పుడు దీనిని విడుదల చేశారు. లాండ్ రోవర్ నుంచి వచ్చిన నాల్గో ఎస్ యూవీ వాహనం ఇది.

ఇండియాలో  ఎవాక్‌ మోడల్‌ లాంచ్‌ చేసి ఆరేళ్లయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్‌ను  తీసుకొచ్చినట్టు చెప్పింది. ఆకర్షణీయమైన మెరైన్‌ బ్లూ  షేడ్‌తో మూడురంగుల్లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది. పాత మోడల్ తో పోలిస్తే.. చాలా మార్పులు చేశారు.   దీనిలో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లను అమర్చారు.   స్టాండర్డ్‌ వైఫై హాట్‌ స్పాట్‌ తదితర సదుపాయాలు కూడా కలవు.

loader