అందాల తార ఐశ్వర్యారాయ్ కి అభిషేక్ బచ్చన్ తో వివాహం జరిగింది కదా..? మళ్లీ ఇప్పుడు లాలు కుమారుడిని పెళ్లి చేసుకోవడం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే లాలు కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్యారాయ్ ని పెళ్లి చేసుకుంటన్నాడు. కానీ.. ఆ ఐశ్వర్య.. బచ్చన్ కోడలు ఐశ్వర్య కాదు.. బిహార్ కి చెందిన రాజకీయ నాయకుడు చంద్రిక రాయ్ కుమార్తె.

లాలూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. చంద్రిక తండ్రి డరోగా ప్రసాద్‌ రాయ్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. 1970లో 11 నెలల పాటు ఆయన బిహార్‌కు ముఖ్యమంత్రిగా బాధత్యలు చేపట్టారు. మేలో తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్యల నిశ్చితార్థం జరగనుంది. వేడుకను పట్నాలోని ఓ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు.

దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం లాలు ప్రసాద్ యాదవ్. జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ పెళ్లి బాధ్యలన్నింటినీ.. లాలు భార్య రబ్రీ దేవీ చూసుకుంటన్నారు. పెళ్లి, నిశ్చితార్థ వేడుకకు లాలు.. పేరోల్ మీద బయటకు వస్తారు. వీరి వివాహానికి ప్రధాని మోదీ సహా.. అన్ని రాజకీయ పార్టీ నేతల ప్రముఖులు హాజరుకానున్నారు.