Asianet News TeluguAsianet News Telugu

కింగ్ లేదా కింగ్ మేకర్ పవన్ కల్యాణే....లగడపాటి సర్వే?

2019 లో వీచేది జనసేన హవాయే నట... లగడపాటి సర్వే పేరుతో హల్ చల్ చేస్తున్న ఫలితాలు

lagadapati predicts janasena to become either king or king maker

విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ మరొక నిర్వహించారా?  ఆయన తాజాగా  నిర్వహించిన సంచలన 2019  ‘సర్వే’ అంటూ ఈ వివరాలు విడుదలయ్యాయి.  దీని ఫలితాలను మీడియాకు లగడపాటి సర్వే పేరుతో అందించారు. ఆయన ఎపుడు జరిపించారో తెలియదు. అయితే,  2019 లో తెలుగుదేశం పార్టీకి  71 సీట్లే వస్తున్నాయి. తర్వాతి స్థానం జనసేనది. ఆ పార్టీకి 65 స్థానాలట. ఇక వైసిపికి  మూడో స్థానమేనని సర్వే చెబుతున్నాది. ఇవిగో అవివారాలు. మాకు అందినవి అందినట్లు  వ్యాఖ్యలేవీ చేర్చకుండా  అందిస్తున్నాం. ఈ సర్వే గురించి వాకబు చేసేందుకు ప్రయత్నిస్తే లగడపాటి ఫోన్ కు అందుబాటులో లేరు. అయితే, ఈ సర్వే ఫలితాలను చర్చించేందుకే ఆయన ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారని తెలిసింది. 

జిల్లాల వారీగా 2019 ఫలితాలు ఇలా ఉంటాయట.

1 . శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 5

2 . విజయనగరం మొత్తం సీట్లు – 9

టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 4

3 .విశాఖపట్నం మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి – 6
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 9

4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19

టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 1
జనసేన గెల్చుకొనేవి – 15

5 .పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 12

6 .కృష్ణ మొత్తం సీట్లు – 16

టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 6

7 .గుంటూరు మొత్తం సీట్లు – 17

టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 2
జనసేన గెల్చుకొనేవి – 5

8 .ప్రకాశం మొత్తం సీట్లు – 12

టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 3

9 .నెల్లూరు మొత్తం సీట్లు 
– 10

టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 3

10 .కడప మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

11 .కర్నూల్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

12 .అనంతపురం మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 0

13 .చిత్తూర్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి – 7
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 3

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175

టీడీపీ గెల్చుకొనేవి – 71

వైస్సార్సీపీ గెలిచేవి – 39

జనసేన గెల్చుకునేవి – 65

Follow Us:
Download App:
  • android
  • ios