మాజీ కాంగ్రెస్ (విజయవాడ ఎంపి) లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రియ చంద్రబాబు నాయుడికి అనధికారికి అడ్వయిజర్ గా మారినట్లు చెబుతున్నారు. తాను రాజకీయాల్లోకి ఇక రాను అని చెప్పినా ఆయన రాజకీయ నాయకుల మధ్యే గడుపుతున్నారు. వాళ్లను తరచూ కలుస్తున్నారు. వాళ్లతో రాజకీయాలు, సర్వేల గురించి మాట్లాడుతున్నారు.  అంతా ఇపుడు ఆయనను సర్వే రాజగోపాల్ అంటున్నారు.  అందువల్లే ముఖ్యమంత్రి ఆయనను అస్థాన   సెఫాలజిస్టు (psephologist) అంటే ఓట్ల విశ్వేషణ చేసే పెద్దమనిషిగా నియమించుకున్నారని అంటున్నారు.

ఎన్నికల దగ్గిర పడుతూ ఉండటంతో నియోజకవర్గాలలో పరిస్థితులెలా ఉన్నాయి, ఎమ్మెల్యేల పరిస్థితులెలా ఉన్నాయి, తెలుగుదేశం గెలుపు ఓటముల సంగతెలా ఉంది, గెలవాలంటే ఏమి చేయాలి... ఇలా అన్నింటిపైనా ఆయన తెలుగుదేశం అధినేతకు సలహా లిచ్చేపనిలో పడ్డారట. తెలిసిన వాళ్ల చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా చంద్రబాబు కోసం ఆయన సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నడవడి మీద కూడా ఈ సర్వే ఫలితాలను నిఘా పెడతారని  వారు ‘ఏషియానెట్’ కు చెప్పారు.   ఈ మధ్య ‘ఏఎమ్మెల్యే ఎక్కడ, ఎపుడేం చేస్తున్నాడో నాకు తెలుస్తుంది,’ అని  చంద్రబాబు నాయుడు, పదే పదే అనడం వెనక అంతా  ఇంటెలిజెన్స్ వారి నిఘా అనుకున్నారు.

 

ఇపుడు కాదని, ఇదంతా  అర్జీఎస్ ద్వారా లగడపాటి రాజగోపాల్ చేయిస్తున్న సర్వే ప్రభావం అని పార్టీగుసగుసలు మొదలయ్యాయి. రాజకీయ నాయకుడిగా ఎదగలేకపోయినా, లగడపాటి సర్వే ల ద్వారా బాగా పేరుతెచ్చుకున్నారు.ఇది చంద్రబాబు నాయుడికి బాగా నచ్చింది. అందువల్ల లగడపాటి తో రకరకాల సర్వేలు చేయించి, నియోజకవర్గాల, ఎమ్మెల్యేల విషయాలన్ని తెలుసుకుని కొత్త వ్యూహంతో 2019లో జగన్ తో తలపడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నాడని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. అంతేకాదు, లగడపాటి సర్వేల అధారంగా ప్రతిపక్షానికి చెందిన ఏ ఎమ్మెల్యేని ‘ఆకర్షించా’లొ కూడా బాబు నిర్ణయిస్తారని వారంటున్నారు. అయితే, విజయవాడ లోక్ సభ సీటు కొట్టేసేందుకు లగడపాటి తెలుగుదేశం అధినేతకు ఇలా సహాయం చేస్తున్నారని కూడా పార్టీ లో వినబడుతూ ఉంది. ఈ వార్తల మీద లగడపాటి ని కాంటాక్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అయితే విషయం మీద స్పందించాలని కోరినపుడు  వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి (ఉరవకొండ, అనంతపురం జిల్లా) ఇలా అన్నారు.

 

‘ ఇది వైసిపినేత జగన్ యాత్ర పని చేస్తున్నదనేందుకు సాక్ష్యం. అధికార పార్టీలో గుబులు మొదలయింది. గత మూడేళ్ల లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో నెంబర్ వన్ అయిందని, పదిలక్షల కోట్ల పెట్టబడి ఎమ్ వో యు లు, అయిదు లక్షల ఉద్యోగాలు, పోలవరం, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించామని చెప్పుకుంటూ ఈ సర్వేలు, చింతకాయలు ఎందుకు? తెలుగుదేశం పార్టీ పునాదులు కదులుతున్నాయి. 2019లో  ఏ సర్వే తెలుగుదేశాన్ని కాపాడలేదు,’ అని అన్నారు.