నోట్ల రద్దుపై హెచ్చార్సి కి ఫిర్యాదు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని వ్యాఖ్య
నోట్ల రద్దుతో సమాన్య జనం అష్టకష్టాలు పెడుతుంటే.. మోదీ ప్రకటనను ఆమెదించేవారు కొందరు.. వ్యతిరేకించేవారు మరికొందరు.. ఇక ప్రతిపక్షాలైతే ఈ ప్రకటనను రచ్చ రచ్చ చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ధర్నాలు, నిరసనలతో ఢిల్లీని వేడెక్కిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మాత్రం సైలెంట్ గా ఈ విషయంపై తన పని తాను కానిస్తూ ఉన్నారు. నోట్ల రద్దుతో కేంద్రం రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారంటూ ఆయన ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ)లో సోమవారం ఫిర్యాదు చేశారు.
నోట్ల రద్దుతో సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు వీలుగా ఆర్థిక శాఖకు తగు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
