కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆదోని మండలంలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. యువతిని కిడ్నాప్ చేసి బంధించి మరీ అత్యాచారం చేశాడు. ఈ ఘటన గత శనివారం జరగ్గా యువతి బయపడి ఈ విషయాన్ని బైటపెట్టక పోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదోని మండలకేంద్రానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన తాయప్ప అనే ఆటో డ్రైవర్ తరచూ వేధించేవాడు. ప్రేమ పేరుతో యువతి వెంటపడే ఇతడు యువతిని తన కోరిక తీర్చాలని బెదిరించేవాడు. అయితే ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెబితే గొడవలు జరుగుతాయని యువతి ఈ విషయాన్ని ఎవరినీ చెప్పకుండా ఉంది. దీన్నే అదునుగా తీసుకున్న తాయప్ప యువతిని కిడ్నాప్ చేసి అనుభవించాలని పథకం వేశాడు.గత శనివారం ఈ అమ్మాయి ఒంటరిగా బైటకు రావడంతో తాయప్ప, అతని దోస్తులు అంజినయ్య, చిన్నభీమయ్య, మల్లయ్య, శీను, వీరేష్‌, వెంకటేశులు కలిసి యువతిని కిడ్నాప్ చేశారు. అరవకుండా నోట్లో బట్టలు కుక్కి ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం యువతికి మత్తుమందిచ్చారు. స్పృహ కోల్పోయిన ఈ అమ్మాయిని భద్రాచలానికి తీసుకువెళ్లిన తర్వాత ఓ గదిలో బంధించి తాయప్ప తన కోరిక తీర్చుకున్నాడు.

యువతికి మెలకువ వచ్చిన తర్వాత అందరూ కలిసి బెదిరింపులకు  దిగారు. అత్యాచారం జరిగిన విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. అయినా బయపడకుండా యువతి పోలీసులకు ఫిర్యాధు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.