తొందరేమీ లేదన్న కుమారస్వామి: బిజెపి వ్యతిరేక శిబిరంలో జోష్

Kumaraswamy waiting Governor's invitation
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ వాజుభాయ్ వాలా పిలుపు కోసం జెడిఎస్ నేత కుమారస్వామి ఎదురు చూస్తున్నారు.

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ వాజుభాయ్ వాలా పిలుపు కోసం జెడిఎస్ నేత కుమారస్వామి ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో దేశంలోని బిజెపి వ్యతిరేక శిబిరంలో జోష్ కనిపించింది. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పలు పార్టీల నాయకులు కర్ణాటక పరిణామాలపై ప్రతిస్పందించారు. 

ప్రస్తుత కష్టాలన్నిటికీ బీజేపీ నేత యడ్యూరప్పే కారణమని కుమారస్వామి అన్నారు. యడ్యూరప్ప రాజీనామా తర్వాత ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల కష్టాలకు యడ్యూరప్ప  బాధ్యత వహించాలని ఆయన అన్నారు. 

తాను తొందరపడటం లేదని, తాము గవర్నర్ వజుభాయ్ వాలా ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నామని కుమార స్వామి చెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోయి ుంటే బీజేపీ బేరసారాలకు దిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బీహార్ నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ బీజేపీపై దుమ్మెత్తి పోశారు. బీజేపీ నేతలను అబద్దాల కోరులతో పోల్చారు, సత్యం ముందు వారు ఓడిపోయారని అన్నారు. "సత్యం ఎప్పుడూ ఓడిపోదు. అబద్దాన్ని, అబద్దాలకోరును సత్యం ఎప్పుడూ ఓడిస్తూనే ఉంటుంది" ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫ్లోర్ టెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.

కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని తృణమూల్ కాంగ్రెసు చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్  చేశారు. పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కూడా బిజెపిపై విమర్శలు చేశారు.

 గవర్నర్ వాజూభాయ్ వాలాపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. "రాజ్యపాల్ వాజూభాయ్.. మీరు రాజీనామా ఎప్పుడు ఇస్తున్నారు?" అని ఆయన అడిగారు. 

loader