21న కుమారస్వామి ప్రమాణం: మమతా బెనర్జీ ట్వీట్

Kumaraswamy to swear in as CM on Monday
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా జెడిఎస్ నేత కుమారస్వామి ఈ నెల 21వ తేదీ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా జెడిఎస్ నేత కుమారస్వామి ఈ నెల 21వ తేదీ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు, ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. 

ఇదిలావుంటే, కాంగ్రెసు, జెడిఎస్ నేతల మధ్య బెంగళూరులోని హిల్టన్ హోటల్లో చర్చలు జరుగుతున్నాయి. క్యాబినెట్ కూర్పుపై ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెసుకు చెందిన పరమేశ్వరకు దక్కుతుంది.

ఎమ్మెల్యేలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన డికె శివకుమార్ కు ఇంధన శాఖ దక్కే అవకాశం ఉంది. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు ప్రజా పనుల శాఖను అప్పగిస్తారని సమాచారం.

loader