క్రికెటర్ ఇన్ స్టాగ్రామ్ లో అశ్లీల ఫోటో.. షాక్ తిన్న ఫ్యాన్స్

First Published 21, Feb 2018, 12:41 PM IST
Kuldeep Yadav apologises for  unsolicited Instagram post after account hacked
Highlights
  • హ్యాకింగ్ కి గురైన కుల్ దీప్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్

టీంఇండియా క్రికెటర్ కుల్ దీప్ యాదవ్.. ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాకింగ్ కి గురైంది. హ్యాకర్లు కుల్ దీప్ ఎకౌంట్ నుంచి ఒక అశ్లీల ఫోటోని పోస్ట్ చేశారు. తమ అభిమాన క్రికెటర్ నుంచి ఇలాంటి పోస్టు రావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ తిన్నారు. కాగా.. వెంటనే కుల్ దీప్ దీనిపై వివరణ ఇచ్చారు.

 

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని కుల్ దీప్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అంతేకాకుండా హ్యాకర్లు తన ఖాతా నుంచి అభ్యంతరకర పోస్టులు పెట్టారని.. అందుకు క్షమించాలని ఆయన కోరారు. తన పాస్ వర్డ్ మరింత భద్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆ పోస్టు చేసింది తాను కాదని అభిమానులు అర్థం చేసుకున్నందుకు దన్యవాదాలు తెలిపారు. కాగా కుల్ దీప్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు 3లక్షల మందికి పైగా ఉన్నారు.

loader