కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లి సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వడ్లమూడి సునీల్ (25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. తెంపల్లిలో  ఉద్యోగం చేసే సునాల్ తన విధులను ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 10గంటల సమయం లో ఇతడు ద్విచక్రవాహనంపై వెళుతుండగా   విశాఖపట్నం నుండి బెంగళూరుకు వెళుతున్న ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో సునీల్ అక్కడికక్కడు మృతి చెందాడు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉంగుటూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.