Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక

  • రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక
  • ఫలితాలు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
  • ఎన్నిక గత సోమవారం జరిగింది

 

kovid elected 14 th president of india over meira kumar

ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి గా ఎంపికయ్యారు. ఈ రోజు  జరిగిన  ఓట్ల లెక్కింపులో ఆయనకు  65.65 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నిక సోమవారం నాడు జరిగింది. దీనితో ఆయన భారత దేశపు 14 వ రాష్ట్రపతి అవుతారు.

ప్రతిపక్షాల అభ్యర్థి, మాజీ స్పీకర్  మీరా కుమార్ కు వోటమి తప్పలేదు.

కౌంటింగ్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఫలితం ప్రకటించారు.  కోవింద్ కు 522 ఎంపిలు ( వోటు విలువ 3,69,576) మద్దతు లభించగా  మీరాకుమార్ కు 225 ఎంపిలే వోటు( వోటు విలువ 1,59,300) వేశారు.

కోవింద్ దేశానికి రెండోదళిత రాష్ట్రపతి అవుతారు. మొదటి వ్యక్తి కెఆర్ నారాయణ్. 

ఆంధ్రప్రదేశ్ నుంచి మీరాకు ఒక్క ఓటు కూడా పడలేదు.  అయితే మూడు వోట్లు చెల్లకుండా పోయాయి. మాక్ పోలింగ్ పెట్టుకున్నా ఇది జరిగడం విశేషం.

 

kovid elected 14 th president of india over meira kumar

 

ఎన్నికయిన సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీయే అభ్యర్థితో తనకు స్నేహం ఎపుడో మొదలయిందో గుర్తు చేసుకున్నారు.

 

 

ఎపి ముఖ్యమంత్రి  చంద్రబాబు అభినందన

భారత రాష్ట్రపతి గా ఎన్నికైన రాంనాథ్ కొవిందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.రాంనాథ్ కొవింద్ అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత పదవిని అలంకరించారని చంద్రబాబు ప్రశంసించారు.తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థి రాష్ట్రపతి గా ఎన్నిక కావడం తనకెంతో సంతోషం కలిగిస్తున్నదని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios