నెల్లూరు రూరల్ కోటం రెడ్డికి కోపం వచ్చింది

నెల్లూరు రూరల్ కోటం రెడ్డికి కోపం వచ్చింది

 

నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి ‘మనఎమ్మెల్యే మన ఇంటికి’ పాదయాత్ర చేపట్టి రెండు నెలలు దాటింది. నియోజకవర్గంలో ప్రజలెలా ఉన్నారు, వీధులెలా ఉన్నాయో, పరిపాలన ఎలా ఉందో తెలుపుకునేందుకు ఆయన ఇల్లొదలారు. జనం మధ్య నివసిస్తున్నారు.  ఈ యాత్రలో ఆయనకు అనేక ఆసక్తి కరమయిన విషయాలు కనిపించాయి. మురికి వాడలెక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి లేదు. రోడ్లు లేవు, లైట్లు లేవు. అన్నీ సమస్యలే. మరి ప్రభుత్వేం ఏమిచేస్తున్నదనేది ఆయన వేస్తున్న పశ్న.
ఈ రోజు పబ్లిక్ హెల్త్ అధికారులతో రూరల్ ఎమ్మెల్యే వాగ్వావాదానికి దిగాల్సి వచ్చింది. తను తిరుగుతున్న కాలనీలోకి ఒకసారి మీరొచ్చి చూడండి అని ఆయన గద్దించారు. మీరురాకుంటే ఈ బురద రోడ్లపైనే రాత్రికి పడుకుంటా...? అని హెచ్చరించారు. మనఎమ్మెల్యే-మనఇంటికి కార్యక్రమంలో భాగంగా బుజబుజనెల్లూరు లోని సమతా నగార్లోని బురదరోడ్ల ను చూసి ఆశ్చర్య పోయారు. ఆగ్రహం వ్యక్తంచేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రోడ్లు తవ్వేసి వదిలేశారు. కాలువలు కూడా తవ్వడంతో మురుగునీరు అంతా తవ్వేసిన రోడ్లపై నిలిచి బురద మడుగులాగా తయారైంది .దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులను నిలదీశారు. రోడ్డును నడిచేందుకు వీలుగా చేయకపోతే బురదలోనే కూర్చొని ,రాత్రికి ఇక్కడే నిద్రపోతానని హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే సంతానగర్ లో బురదరోడ్డుపై కంకర డస్ట్ పోసి రాకపోకలకు అనువుగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ పరిస్థితి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos