సెంచరీతో దూసుకుపోతున్న కోహ్లీ. అర్థ సెంచరీతో క్రీజులో కొనసాగుతున్న రోహిత్.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 76 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేశాడు.ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి భారత్ 215 పరుగులు చేసింది. కోహ్లీ126, రోహిత్ 82 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన భార‌త్ కు ఆదిలోనే శ్రీలంక షాక్ ఇచ్చింది. 1.3 ఓవ‌ర్ వ‌ద్ద ఫెర్నాండో బౌలింగ్‌లో టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ కేవ‌లం 4 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరుకే వెనుదిరిగాడు. అనంత‌రం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ కోహ్లీ శ్రీలంక బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. క్రీజులోకి రాగానే బాదుడు మొదలుపెట్టాడు.కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అదే ఊపుతో 76 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. 29వ వ‌న్డే సెంచ‌రీని పూర్తి చేశాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ కూడా త‌న‌దైనా స్టోక్ ప్లేతో అద్బుతంగా రాణిస్తున్నాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇరువురు క‌లిసి దొరికిన‌ బంతిని దొరికినట్టు బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కలిసి 168 బంతుల్లో 209 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.