Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ కు కోదండరాం ఘాటు చురకలు

కేసిఆర్ కు కోదండరాం ఘాటు చురకలు
kodandaram fires on kcr

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నికంకుశ పాలన కొనసాగిస్తోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. జన సమితి పార్టీ తరపున ఈ నెల 29 వ తేదీన తలపెట్టిన సభకు పోలీసుల సాయంతో ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయి అనుమతి కోసం కోర్టును ఆశ్రయించినట్లు కోదండరాం తెలిపారు. ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరతామని అందుకోసం ఎక్కడికి వెళ్లడానికైనా సిద్దమేనన్నారు.

ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన కోదండరాం ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వ నిరంకుశత్వం చూస్తుంటే అసలు ప్రజాస్వామ్య దేశం లో ఉన్నామా అని సందేహంగా కలుగుతోందన్నారు. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలు వారికి జవాబుదారీతనంగా ఉండాలని, చట్టాలకు లోబడి పాలన సాగించాలని సూచించారు. ఆర్టికల్ 19 ప్రకారం మనిషి ప్రాథమిక హక్కులకు కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని తుంగలోతొక్కుతుందన్నారు. అసలు వాటిని పట్టించుకోకుండా నిబంధనలు పెట్టడాన్ని కోదండరాం తప్పుబట్టారు.

ఇక టిజెఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరిచండంలో ప్రభుత్వ హస్తం ఉందన్నారు. తమ పార్టీ సభ పెట్టడం వల్ల కాలుష్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని అంటున్నవారికి మొన్న సినిమా సభ వల్ల ఏర్పడిన కాలుష్యం కనిపించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెట్టడం వల్ల ప్రభుత్వం తన పరువును  తానే తీసుకుందన్నారు. మాకు సభ పెట్టె హక్కు ఉందని అందుకోసం కోర్టును ఆశ్రయించినట్లు కోదండరాం తెలిపారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios