క్రిస్మస్ పై నిషేధం విధించిన ఉత్తరకొరియా నియంత
సర్వమానవాళికి ప్రేమను పంచమని చెప్పిన జీసెస్ జన్మదినాన్ని ప్రపంచమంతా క్రిస్మస్ గా జరుపుకుంటుంది.
కేవలం క్రిస్టియన్ దేశాలే కాదు ముస్లింలు అధికంగా ఉండే అరబ్ దేశాలలో కూడా క్రిస్మస్ సంబరాలపై ఎలాంటి ఆంక్షలు విధించవు.
కానీ, ఈ దేశంలో అలా కాదు.. అధ్యక్షుడు చెప్పేదే వేదం.. చేసిందే శాసనం... ఎవరైనా ఆయన మాటలకు అడ్డు చెబితే మెడకాయ మీద తలకాయలుండవు.
క్రాఫ్ ఎలా కట్ చేసుకోవాలనే దగ్గరి నుంచి ఏ దేవుడిని పూజించాలి వరకు అంతా ఆయన చెప్పినట్లే దేశ ప్రజలందరూ చేయాలి. లేదంటే జీవితాంతం జైలులో చిప్పకూడే తినాలి.
ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఆ దేశం... ఉత్తర కొరియా అని...
ఆ దేశ నియంత కిమ్ జుంగ్ ఉన్ ఇప్పుడు తన దేశంలో ఒక కొత్త శాసనం తీసుకొచ్చాడు.
ఇకపై దేశ ప్రజలెవరూ క్రిస్మస్ ను జరుపుకోవద్దని ఆదేశించాడు. క్రీస్తు పుట్టిన రోజు కంటే మా నానమ్మ పుట్టిన రోజుగానే డిసెంబర్ 25 ను ప్రజలు గుర్తుంచుకోవాలని గర్జించాడు.
అంతేకాదు అధికారికంగా దేశంలో జీసెస్ జన్మదినం జరుపుకోకుండా నిషేధం విధించాడు.
ఈ నియంత నానమ్మకు కూడా గొప్ప చరిత్రే ఉందిలేండి. పవిత్ర గొరెల్లా మాత గా దేశ ప్రజలు కీర్తించే ఈమె అసలు పేరు కిమ్ జంగ్ సక్.. ఉత్తర కొరియా మొదటి అధ్యక్షుడు కిమ్ 2 సంగ్ భార్య. ఈమె సంతతే ఇప్పుడు నియంతలుగా దేశాన్ని పాలిస్తున్నారు.
కిమ్ జంగ్ సక్ జపాన్ తో జరిగిన గొరెల్లా యుద్ధంలో పాల్గొంది. 1949 లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆ తర్వాత ప్రతి డిసెంబర్ 25 న దేశ ప్రజలందరూ ఆమె స్మారకస్థూపం వద్ద నివాళిఅర్పించడం సంప్రదాయంగా వస్తోంది.
ఇప్పుడు తన నానమ్మను మరింతగా వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో కిమ్ జంగ్ ఉన్.. డిసెంబర్ 25న క్రిస్మస్ ను జరపడం పై నిషేధం విధించాడు. ఆ రోజు తన నానమ్మనే దేశ ప్రజలందరూ పూజించాలని ఆదేశించాడు.
గతంలో కూడా ఈయన తండ్రిగారు క్రిస్మెస్ ట్రీ లో దేశంలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాయాది దేశం తమ దేశ సరిహద్దు లో అతిపెద్ద క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో దాన్ని కూల్చివేస్తానని హెచ్చరించాడు.
1950 వరకు దేశ రాజధాని ప్యాన్ గాంగ్ లో క్రిస్టియన్లు అధికంగానే ఉండేవారు. కానీ, ఆ తర్వాత దేశ నియంత వారందరినీ చిత్రహింసలు పెట్టి జైళ్లో పడేశాడు.
ఇప్పటికీ వేలాది మంది క్రిస్టియన్లు కాన్సన్ట్రేషన్ క్యాంప్ పేరుతో ఉండే ఆ జైళ్లో జీవచ్ఛవంలా బతుకుతున్నారు.
