త్వరపడండి.. ఆలోచించిన ఆశాభంగం. కిలో ల్యాప్ టాప్ కేవలం రూ.5 లే. ఏంటి ఇదంతా.. ల్యాప్ టాప్ ఏమైనా కూరగాయలా కిలోల లెక్క అమ్మడానికి అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే.. నిజంగానే ఓ మార్కెట్లో ల్యాప్ టాప్స్ ని కిలోల లెక్క అమ్ముతున్నారు. అది మరెక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. షోరూమ్స్ లో అత్యంత ఖరీదుకి లభించే ల్యాప్ ట్యాప్ లను  కిలోల లెక్క అమ్మేస్తుంటారు.

షోరూమ్‌లలో రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకూ ఉంటే ల్యాప్‌టాప్‌లను ఇక్కడ తూకం వేసి అమ్మేస్తుంటారు. మంచి కండీషన్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు కిలో రూ. 5 వేల చొప్పున ఇక్కడ లభ్యమవుతాయి. ఈ మార్కెట్ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో ఉంది. ఈ మార్కెట్ దేశంలోనే అత్యంత చవకైన మార్కెట్‌గా పేరొందింది. ఇక్కడ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు మొదలైనవాటిని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నూతన డివైజెస్‌తో పాటు సెకెండ్ హ్యాండ్‌వి కూడా లభ్యమవుతాయి. ఇలాంటి దుకాణాలు ఇక్కడ లెక్కకు మించి ఉన్నాయి. అయితే ఇక్కడ వేటినైనా కొనుగోలు చేసేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం మంచిది. ఇక్కడ దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి మాట్లాడుతూ తమ దగ్గర కేవలం రూ. 7 వేలకే సెకెండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ లభిస్తుందని తెలిపాడు. వీటిపై డిస్కౌంట్ కూడా అందిస్తామన్నాడు.