అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని సాయిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ దంపుతులు మంగళవారం స్వామి వారి దర్శనం కోసం వచ్చారు.వారు నిద్రిస్తుండగా వారి కుమారుడిని ఒక దుండగుడు అపహరించుకుపోయాడు
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఒక బాలుడి కిడ్నాప్ జరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఒక జంట ఆదమరిచి నిద్రిస్తుండగా వారి కుమారుడిని ఓ దుండగుడు అపహరించుకుపోయాడు.

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని సాయిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ దంపుతులు మంగళవారం స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. నిన్న రాత్రి లేట్ అవడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్లమండంపం దగ్గర తమ కుమారుడు(1) చెన్నకేశవులుతో కలిసి నిద్రించారు. దంపతులిద్దరూ గాఢనిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లిపోయాడు. విషయం తెలిసి బాలుడి తల్లి బోరున విలపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 5.56 గంటలకు జరిగిన ఈ ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విచారణలో భాగంగా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు నిందితుడి దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసుల ప్రయత్నిస్తున్నారు.

కిడ్నాప్‌కు గురైన బాలుడు బ్లూకలర్ షర్ట్, పింక్ కలర్ ప్యాంట్‌తో.. కర్లీ హెయిర్ ఉండి ఫెయిర్‌గా ఉన్నాడని, ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉందని.. ఈ బాలుడి ఆచూకీ తెలిసిన వారు తమ వాట్సాప్ నంబర్ 8099999977కు తెలియజేయాలని తిరుపతి పోలీసులు సూచించారు.
