Asianet News TeluguAsianet News Telugu

తొందర్లో మార్కెట్లోకి అనంతపురం కార్లు

అనంతపురము జిల్లాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడితో  కార్ల తయారీ కేంద్రం రాబోతున్నది. పెనుకొండలో ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును కియా మోటార్స్  నిర్మిస్తుంది.

Kia motors to set up car unit in drought hit Anantapur district

ఎపుడు కరువు కరువు  అని గోల చేసే అనంతపురం జిల్లాకి ఏకంగా కార్ల ఫ్యాక్టరీ రాబోతున్నది.

 

  మామూలు కార్లే కాదు, లగ్జరీ కార్లు కూడా ఇక్కడ తయారవుతాయి.

 

అనంతపురము జిల్లాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడితో  కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. పెనుకొండలో ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును కియా నిర్మిస్తుంది.

 

2019 చివరి కల్లా అనంతపురం కార్ల ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్లాంటు నిర్మాణం మొదలవుతుంది. భారతీయ మార్కెట్ అవసరాలకు తగినట్టుగా హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్, ఎస్‌యూవీ తరహా కార్లు తయారవుతాయి.

 

మొత్తానికి ఎపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రసిద్ధ కార్ల కంపెనీ ‘కియా’ సంసిద్ధత వ్యక్తం చేసిందని ప్రభుత్వం తెలిపింది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధుల అవగాహన ఒప్పందం కుదుర్చకుంది.

 

అనంతపురం కార్లను 90 శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయం.

 

ఎంవోయూ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు, సీఈవో హాన్ వూ పార్క్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యారాజ్ పాల్గొన్నారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి లభిస్తుంది.

 

కియాకు దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాలలో ప్లాంట్లు ఉన్నాయి.

 

ఇతర రాష్ట్రాలనుంచి ఏపీకి చివరి వరకు గట్టి పోటి తగిలినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాకచక్యంగా కియా కంపెనీని అనంతపురం వైపు మళ్లించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి చర్చల తర్వాత కియా.అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టాలని  నిర్ణయించింది.

 

ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి అనేక అంశాలు కియా రాష్ట్రానికి రావడానికి సహకరించాయని సిఎం వొ తెలిపింది. రాష్ట్రంలో రెండో కార్ల కంపెనీ. కార్ల తయారీ దిగ్గజం ఇసుజు

 

రాష్ట్రంలో ఇప్పటికే తయారీ యూనిట్‌ను ప్రారంభించి మార్కెట్‌లోకి తన కార్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios