ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ గురించి.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఆయన మైదానంలో ఎలా చెలరేగిపోయేవారో అందరికీ తెలిసిందే. ఈ విషయం పక్కనపెడితే.. పీటర్సన్ కి వన్యప్రాణులంటే అమితమైన ప్రేమ. ఇందుకు నిదర్శనంగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు.

ఆయన ఇటీవల చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ నుంచి ఒక చిన్న చిరుత పిల్లను దత్తతు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. ‘‘ ఇందులోనే ఆనందం ఉంది. చిన్న చిరుత పిల్ల ఎంత అందంగా ఉందో చూడండి?’’ అంటూ ట్వీట్ చేస్తూ.. పాల డబ్బాతో ఆ బుల్లి చిరుతకు పాలను తాగిస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు పీటర్సన్.

దీనితో పాటు మరోవీడియోని కూడా ఆయన పోస్ట్ చేశాడు. అందులో జింక పిల్లతో చిరుత పిల్ల సరదాగా ఆడుకుంటోంది. ఈ రెండు వీడియోలను చూసిన నెటిజన్లు.. క్రికెటర్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమంటూ పొగిడేస్తున్నారు.