ఎన్టీరామారావు భార్య లక్ష్మి పార్వతి కథ కు శశికళ కథ కు తెడా లేదంటున్నారు ‘లక్మి'స్ వీర గంధం’ చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం లక్మి'స్ వీరగ్రంధం ఈ నెల  రెండవ వారం నుంచి షూటింగ్ మొదలు కానున్న దని ఆయన చెప్పారు. లక్మి పార్వతి పాత్రలో  విశ్వరూపం ,గరుడవేగా లలో హీరోయిన్ గా నటించిన పూజకుమార్ నటించనున్నదని ఆయన చెప్పారు. అదేవిధంగా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న శశికళ  కూడ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వస్తుందని చెబుతూ లక్మి పార్వతి జీవితం, శశికళ జీవితం ఒకటే నని ఒక సేవకురాలుగా మరొకరి జీవితంలో ప్రవేశించి  ఒక రాజాంగేతర శక్తిలా  ఎలా నడుచుకొన్నారో అనే ఇతివృత్తంతో ఈ సినిమాల కథ లు ఉంటాయని ఆయన చెప్పారు. ఇద్దరి లక్యం ఒకటే కావడం విశేషమని అన్నారు, ఈ రెండు సినిమాలలో నేటి సమకాలీన రాజకీయాలు .యాదార్ధ సంఘటనల  ఆధారాలతో నిర్మాణమవుతున్నాయని  రెండు చిత్రాల కు తానే దర్శకత్వం వహిస్తున్నానని  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.

 

 

ఇకపోతే కొందరు అనుకున్నట్టు శశికళ జీవితం ఆధారంగా సినిమా తీస్తే  తమిళనాడు కు చెందిన మన్నార్ గుడి మాఫీయా నా అంతుచూస్తామని అన్నారని కేతిరెడ్డి చెప్పారు.  గతంలో జయలలిత బ్రతికుండగానే తెలుగు భాషకు తమిళనాడులో జరుగుతున్న అన్నాయం పై ఎదిరించటం జరిగిందని, అప్పుడే తనను ఏ శక్తి ఎమీ చేయలేదని ఆయన అన్నారు. జయలలిత మరణం వెనుక కుట్ర ఉందని శశికళ పై సుప్రీంకోర్టు లో కేసు  వేసిన నాడే తనను ఎమీ చేయలేకపోయారని ,ఒక లక్ష్యం తో పనిచే సే వారిని ఎ శక్తి అడ్డుకోలేదని కేతిరెడ్డి తెలిపారు..