చర్యలు చేపట్టిన కేరళ ప్రభుత్వం.. ఘటనపై విచారణకు ఆదేశం
నీట్ పరీక్షలో అడ్డగోలు నిబంధనలు పెట్టి విమర్శల పాలైన అధికార యంత్రాగంపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది.
గత ఆదివారం జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో కేరళలోని కుంన్చిమంగళం టీఐఎస్కే ఇంగ్లీష్ మీడియం పరీక్షా కేంద్రంలో ఏగ్జామ్ నిర్వాహకులు మరీ అతిగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
పరీక్ష కు హాజరవుతున్న ఓ విద్యార్థి లో దుస్తుల్లో మెటల్ బటన్లు ఉన్నాయని చెప్పి అది విప్పే వరకు పరీక్షకు అనుమతించలేదు.
దీనిపై మీడియా లో తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందదించింది.
ఆ కేంద్రంలో భద్రతా విభాగాన్ని పర్యవేక్షించిన నలుగురు ఉద్యోగులపై సస్పెండ్ వేటు వేసింది. అలాగే, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించింది.
కేరళ అసెంబ్లీలో కూడా ఈ విషయం చర్చకు రావడం. ప్రతిపక్షాల ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో వెంటనే సర్కారు అప్రమత్తమై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
