శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ బంగారు ధ్వజస్తంభాన్ని అపవిత్రం చేసిన అయిదుగురు విజయవాడ భక్తులకుకేరళ  న్యాయస్థానం బెయిల్‌ తిరస్కరించింది.ఈ అయిదుగురు ఆగంతకులు ధ్వజ స్థంభం ప్రతిష్టించిన రోజునే పీఠం మీద పాదరసం చల్లి, పోలీసులకు చిక్కారు.

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ బంగారు ధ్వజస్తంభాన్ని అపవిత్రం చేసిన అయిదుగురు విజయవాడ భక్తులకు కేరళ న్యాయస్థానం బెయిల్‌ తిరస్కరించింది.

ఈ అయిదుగురు ఆగంతకులు ధ్వజ స్థంభం ప్రతిష్టించిన రోజునే

పీఠం మీద పాదరసం చల్లి,పోలీసులకు చిక్కారు.

కృష్ణా ఉయ్యూరు మండలం గండిగుంట, పెద్దఓగిరాలకు చెందిన ఈ అయిదుగురిని ఆదివారం పంబలో కేరళ పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.

కోర్టు వారికి 14రోజుల రిమాండ్‌ విధించింది. అయితే, బెయిల్ కోసం దరఖాస్తుచేసుకున్నారు. కోర్టు వారి బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇపుడు వీరందరిని తిరువనంతపురం జైలుకు తరలించారు.పత్తనంతిట్ట జైలు నుంచి తిరువనంతపురం జైలుకు తరలించడంతో ఏమవుతుందో నని కృష్ణాజిల్లాలోని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 సోమవారం నాడు మరొకసారి బెయిల్‌ పిటిషన్‌ వేసేందుకు నిందితులు తరఫున న్యాయవాదులు చెబుతున్నారు.

కేసు దర్యాప్తు కోసం కేరళ నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం మొకటి ఆంధ్రా వచ్చింది.పాదరసం ఎక్కడ నుంచి కొన్నది వారు ఆరాతీసున్నారు.