జడ్చర్ల వద్ద కేరళ విద్యార్తులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం ఇద్దరు మృతి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్చ సమీపంలో జాతీయ రహదారి 44 మీద కేరళకు చెందిన ఒక బస్సుకు జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

బస్సులో వున్న విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ఉదయం ఎనిమిది గంటల సమయంలో జాతీయ రహదారి మీది మాచరం బస్ స్టాప్ వద్ద రోడ్డును దాటుతున్న ఒక వృద్ధురాలిని తప్పించబోయి అక్కడే నిలబడి ఉన్న అయిన ట్రక్ ను ఈ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పొంపి ట్రావెల్స్ ( MH14 CP3488) చెందిన ఈ బస్సు కేరళలోని పరిన్థల్మాన్న కు చెందిన అల్షిఫా ఫార్మసీ ఇన్ స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులను తీసుకువెళ్తున్నది. 

బస్సులో ఉన్న 29 మంది విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే, స్వల్పంగా గాయపడిన వారిని జడ్చర్ల అసుపత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. ప్రమాదంలో బస్సుడ్రయివర్ , క్లీనర్ చనిపోయారని పోలీసులు చెప్పారు.